నొప్పితో మా వారికి శృంగారంలో సహకరించలేకపోతున్నాను.. నేనేం చేయాలి?

by Bhoopathi Nagaiah |
నొప్పితో మా వారికి శృంగారంలో సహకరించలేకపోతున్నాను.. నేనేం చేయాలి?
X

డాక్టర్.. నాకు కీళ్ల నొప్పుల సమస్య ఉంది. నొప్పితో మా వారికి శృంగారంలో సహకరించలేకపోతున్నాను. ఆయనలో అసంతృప్తి, కోపం ఎక్కువైపోతుంటే నాలో డిప్రెషన్ పెరిగిపోతుంది. స్ట్రెస్ వలన నొప్పులింకా ఎక్కువ అవుతున్నాయి. మా దాంపత్య జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి? - మాధవి, సిద్ధిపేట

మాధవి గారు. కీళ్లనొప్పి, వాపు వలన సులువుగా కదలలేకపోవడం అనే సమస్య ఉంటుంది. సెక్స్‌లో చురుకుగా పాల్గొనలేక పోవడం ఉంటుంది. మీ వారు మీ స్థితిని అర్థం చేసుకోవాలి. అదే సమస్య ఆయనకు వస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలి.

మీరు ఈ విధంగా చేయవచ్చు.

  1. నొప్పిలేని సమయంలో సెక్స్‌లో పాల్గొనడం.
  2. సెక్స్‌లో పాల్గొనే 2 గంటల ముందుగా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకోవడం.. వేడి నీళ్ల కాపడం పెట్టుకోవడం చేయాలి.
  3. నొప్పి ఉన్న కీళ్ల పైన ఎక్కువ బరువు పడని భంగిమలు ఎన్నుకోవడం.
  4. తుంటి కీలు ఉన్న సమస్య స్త్రీలలో ఎక్కువగా ఉంటే, కదలికలు తక్కువగా ఉండే స్పూన్ భంగిమను ఎన్నుకోవడం.
  5. ఇలా చేస్తూ వారానికి రెండు సార్లు నొప్పి లేకుండా సెక్స్‌లో పాల్గొనవచ్చు. సెక్స్ సమయంలో విడుదల అయ్యే corticisteroids వలన కీళ్ల చుట్టూ ఉండే కండరాలు, లిగమెంట్స్‌లలో బిగుసుతనం తగ్గి వదులై నొప్పి తగ్గుతుంది.

మీ వారు మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీపట్ల బాధ్యతతో, సహా అనుభూతితో వ్యవహరించాలి. మీకు రుమతాయిడ్ ఆర్త్రిటీస్ రాకముందు, మీతో మంచి సెక్స్ జీవితం అనుభవించి, ఐపొడు నొప్పితో బాధపడే మిమ్మల్ని ఈ 50 ఏళ్ల వయసులో మీ నొప్పితో సంబంధం లేనట్లు సెక్స్ కోసం వేధించడం చాలా అమానవీయం. నేను చెప్పినట్లు చేయండి.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Advertisement

Next Story