Deputy CM Bhatti: రాహుల్ గాంధీని కలవలేదు

by Gantepaka Srikanth |
Deputy CM Bhatti: రాహుల్ గాంధీని కలవలేదు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గురువారం రాష్ట్ర ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. తాము ఇంకా రాహుల్ గాంధీని కలవలేదని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి(Telangana Thalli) గతంలో అధికారికంగా లేదని.. అప్పటి టీఆర్ఎస్(TRS) పార్టీ తరపున తెలంగాణ తల్లి ఉండేదని గుర్తుచేశారు. అంతకుముందు వేరే రూపంలో ఉండేదని.. దానికి బీఆర్ఎస్(BRS) నేతలు మార్చారని అన్నారు. ఇప్పుడు అసలు సిసలైన తెలంగాణ తల్లిని తాము ఏర్పాటు చేశామని తెలిపారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలన్న నిబంధన లేదని.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ(Telangana Assembly) రూల్స్ మార్చారని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేసిన అప్పులకు, పాపాలకు తాము వడ్డీలు కడుతున్నామని అన్నారు. మా ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది అందుకే ప్రచారంలో వెనుకబడ్డామని చెప్పారు. పదేళ్ల తరువాత హాస్టళ్లకు ఇచ్చే డైట్ ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. డిసెంబర్ 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారని కీలక ప్రకటన చేశారు. గత పాలన కంటే మెరుగైన పాలన అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed