అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి..

by Sumithra |
అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి..
X

దిశ, మేడిపల్లి : అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సూరజ్ నగర్ లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కర్నూల్ కి చెందిన కోడిదల మహేంద్ర (27), తండ్రి మద్దిలేటి, భార్య ఇద్దరు పిల్లలతో మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బొల్లిగూడెం, సూరజ్ నగర్ లో నివాసం ఉంటూ బండల పని చేసుకుంటా జీవిస్తున్నారు. గురువారం ఉదయం బొల్లిగూడెంలో ప్రహరితో ఉన్న ఖాళీ ప్రాంతంలో మహేందర్ అనుమానస్పదంగా మృతి చెంది ఉండటాన్నీ స్థానికులు గుర్తించి పోలీసులకు తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు గత రెండు రోజుల నుంచి మద్యం సేవిస్తూ ఉన్నాడని బంధువులు, స్థానికులు తెలియజేశారు. విచారణ చేస్తున్నామని త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని సీఐ గోవింద రెడ్డి అన్నారు.

Advertisement

Next Story