BGT 2024 : హెడ్‌ను ట్రాప్ చేయాలి.. : మహమ్మద్ కైఫ్

by Sathputhe Rajesh |
BGT 2024 : హెడ్‌ను ట్రాప్ చేయాలి.. : మహమ్మద్ కైఫ్
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా బౌలర్ బోలాండ్ కోహ్లీని ట్రాప్‌ చేసినప్పుడు భారత బౌలర్లు హెడ్‌ను ఎందుకు ట్రాప్ చేయకూడదని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. ‘ఆఫ్ సైడ్ బంతులను వెంటాడి హెడ్ ఔట్ అవుతాడు. మన బౌలర్లు ఎందుకు ఆఫ్ సైడ్‌లో బంతులు వేయడం లేదు. విరాట్ కోహ్లీ వీక్‌నెస్ అందరికి తెలుసు. అతను ఆఫ్ సైడ్ బంతులను ఆడి ఔట్ అవుతున్నాడు. అదే స్ట్రాటజీని హెడ్ విషయంలో అమలు చేయాలి. ఫస్ట్ బాల్ నుంచే హెడ్‌పై అటాక్ చేయాలి. హెడ్‌ను ఔట్ చేయడంలో ప్లాన్ ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడే అతన్ని ఔట్ చేయగలం’ అని కైఫ్ అన్నాడు. హెడ్ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌‌లో అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియా జట్టును విజేతగా నిలిపాడు. దీంతో పాటు భారత్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేసి ఆస్ట్రేలియా విజయంలో కీ రోల్ పోషించాడు. అడిలైడ్ టెస్ట్‌లో సైతం 140 పరుగులు చేసి ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో భారత బౌలర్లు హెడ్‌ను త్వరగా ఔట్ చేయడంపై ఫోకస్ చేయాలని కైఫ్ అన్నాడు.

Advertisement

Next Story