- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు మాత్రమే
by Naveena |
X
దిశ ,తిరుమలగిరి: ఆ పాఠశాలలో విద్యార్థుల కేరింతలు పెద్దగా వినిపించవు. అల్లర్లు కనిపించవు. ఆ స్కూల్లో ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వారికి చదువు చెప్పేందుకు ఒక పంతులమ్మ ఉంది. తిరుమలగిరి మండలం కోట్యా నాయక్ తండాలోని ప్రాథమిక పాఠశాలలో ఈ పరిస్థితి నెలకొంది. అయితే పాఠశాల పరిసరాల ప్రాంగణంలో చుట్టుపక్కల వ్యక్తులు తమ సొంత వాహనాలు ట్రాక్టర్లు,ద్విచక్ర వాహనాలు నిలుపుకోవడానికి వాడుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే సరిపడా పిల్లలున్న చోట పంతులు లేరు. పిల్లలు లేని చోట ఉపాధ్యాయులు ఉంటున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం ప్రభుత్వం చొరవ తీసుకొని కృషి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. లేకపోతే ప్రభుత్వ పాఠశాల మనుగడ పతనమైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు మాత్రమే
Advertisement
Next Story