TGSRTC: సర్వీస్ రిమూవల్ కేసుల విషయంలో ఆర్టీసీ కీలక నిర్ణయం

by Ramesh Goud |   ( Updated:2024-12-12 10:36:41.0  )
TGSRTC: సర్వీస్ రిమూవల్ కేసుల విషయంలో ఆర్టీసీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజావాణి(Prajawani)లో నిత్యం తెలంగాణ ఆర్టీసీ(Telangana RTC)కి సంబంధించిన సర్వీస్ రిమూవల్(Service Removal) కేసులపై ఫిర్యాదులు(Complaints) వస్తున్నాయని గుర్తించిన ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుల పరిష్కారం కోసం ఆర్టీసీ అధికారులతో త్రిసభ్య కమిటీని(Three Members Committee) ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఒక చైర్మన్ సహా ఇద్దరు సభ్యులు ఉంటారు. ఈ కమిటీ సర్వీస్ నిమిత్తం వివిధ కేసులను పరిగణలోకి తీసుకొని పరిష్కరించనుంది. ఈ త్రిసభ్య కమిటీ చైర్మన్ గా లేబర్ ఎంప్లాయిమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్(Sanjay Kumar) ను నియమించగా.. సభ్యులుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్(VC Sajjanar), ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య(Divya) కమిటీలో పని చేయనున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల్లో గతంలో సర్వీస్ రిమూవల్ కేసులు నమోదైన వాటిని ఈ కమిటీ పరిశీలించనుంది. ఇప్పటికే ప్రజావాణిలో ఆర్టీసీకి సంబందించిన సర్వీస్ రిమువల్ కేసుల విషయమై ఫిర్యాదులను ఈ త్రిసభ్య కమిటీ పిలిచి రివ్యూ చేయాలని నిర్ణయించింది. అలాగే త్రిసభ్య కమిటీ కేసులో ఉన్న మెరిట్స్ ను బట్టి ఆర్టీసీ యాజమాన్యానికి రికమెండ్ చేయనుంది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Transport Minister Ponnam Prabhakar) తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed