- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Heavy Rain Alert:భారీ వర్షాల ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
దిశ,వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో పలు చోట్ల భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి చిత్తూరు, తిరుపతి, తిరుమల(Tirumala), శ్రీకాళహస్తి, నగరి, పుత్తూరు, సత్యవేడు, పలమనేరు, కుప్పంలో వర్షాలు(Rains) దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో పలు చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అధికారులు కీలక ప్రకటన చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో నేడు(గురువారం) చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు(Holiday) ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎవరైనా తరగతులు(Classes) నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా తిరుపతిలో నేడు భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే.. అల్పపీడన ప్రభావంతో తమిళనాడు(Tamilnadu)లోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వెల్లూరు, పెరంబూర్, సేలం, నామక్కల్, శివగంగ, ముదురై, దిండిగల్, తూత్తుకుడి, తెన్‌కాశీ, తేని జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు చెన్నై, విల్లుపురం, తంజావూరు, మైలాదుత్తురై, పుదుకొట్టై, కడలూరు, దిండిగల్, రామనాథపురం, తిరువరూర్. రాణిపేట్, తిరువల్లూరు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.