Minister Seethakka : అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి మంత్రి సీతక్క హామీ

by Y. Venkata Narasimha Reddy |
Minister Seethakka : అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి మంత్రి సీతక్క హామీ
X

దిశ, వెబ్ డెస్క్ : అంగన్వాడీ(Anganwadi) కేంద్రాల సిబ్బంది సమస్యల పరిష్కరానికి, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క(Minister Seethakka) అంగన్వాడీ ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. గురువారం అంగన్వాడీ ఉద్యోగ సంఘాల నాయకులు సచివాలయంతో మంత్రి సీతక్కను కలిసి తమ డిమాండ్లపై వినతి పత్రం అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అంగన్వాడీ సిబ్బందికి హామీ ఇచ్చిన విధంగా పదవి విరమణ ప్రయోజనాలు కల్పించాలని, అప్ గ్రేడ్ అయిన మినీ అంగన్వాడీ కేంద్రాల సిబ్బందికి జీతాలను పెంచాలని, సకాలంలో జీతాల చెల్లించాంటూ తదితర డిమాండ్లను మంత్రికి వారు విన్నవించారు.

దీనిపై స్పందించిన మంత్రి సీతక్క అంగన్వాడీల సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎంలతో చర్చించి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్కకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, యూనియన్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Next Story

Most Viewed