సీఎం సార్ నమస్కారం.. మీకు అప్పుడు అంతగా సహకరించినా.. ఇప్పుడు సాయం చేయండి...

by Sumithra |
సీఎం సార్ నమస్కారం.. మీకు అప్పుడు అంతగా సహకరించినా.. ఇప్పుడు సాయం చేయండి...
X

దిశ, భైంసా : సీఎం సార్ నమస్కారం..!గతంలో నేను మీకు సహరించా..!ప్రస్తుతం నాకు సహకరించండంటూ..!ఓ రైతు వీడియో విడుదల చేయగా, అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిర్మల్ జిల్లా బాసర మండలం లాబ్ది గ్రామానికి చెందిన రైతు సిందే పీరాజి గతంలో బాసర ట్రిబుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్న సమయనా, ఎవ్వరికీ ఐఐఐటీలో ఎంట్రీ లేని పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డికి సహకరించానని తెలిపారు.

తన సొంత ట్రాక్టర్ పై ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తీసుకెళ్లినని గుర్తు చేశారు. దానికి కృతజ్ఞతగా ప్రస్తుతం తమ కుటుంబానికి సంబంధించి రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయాలని ఓ వీడియోలో మాట్లాడుతూ దాన్ని విడుదల చేశారు. తన ట్రాక్టర్ పై తీసుకెళ్లిన వ్యక్తే సీఎం అయ్యాక తన రుణమాఫీ కాకపోవడంతో అప్పటి సంఘటనను గుర్తు చేసుకొని ఆవేదన చెందుతున్నాడు.

Advertisement

Next Story