జైలులో లగచర్ల రైతుకు గుండెనొప్పి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by srinivas |
జైలులో లగచర్ల రైతుకు గుండెనొప్పి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: లగచర్ల ఘటనలో జైలు పాలైన మంత్రి రైతు హీర్యానాయక్‌(Farmer Hiryanayak)కు గుండె పోటు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. లగచర్ల ఘటనలో అరెస్టైన రైతుల(Farmers)పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. నెల రోజులుగా 40 మంది జైలులో మగ్గుతున్నారని తెలిపారు. జైలులో ఉన్న రైతుకు నిన్న గుండె నొప్పి వచ్చిందని, కానీ పోలీసులు ఆ విషయాన్ని బయటకు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రైతు హీర్యానాయక్‌కు గుండె పోటు వచ్చినట్లు ఆయన కుటుంబసభ్యులకు కూడా తెలియజేయలేదని వ్యాఖ్యానించారు. గుండెనొప్పి వచ్చిన వ్యక్తికి బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకురావడం దారుణమని మండిపడ్డారు. లగచర్ల ఘటన(Lagacharla Incident)లో రైతులతో పాటు పట్నం నరేందర్‌రెడ్డి(Patnam Narender Reddy)ని అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. తనపై ఎలాంటి దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్‌నే చెప్పారని, తమ నిరసనను రైతులు గట్టిగా వినిపించారని కేటీఆర్ తెలిపారు. నెల క్రితం ప్రభుత్వంపై లగచర్ల రైతులు తిరగబడ్డారని గుర్తు చేశారు. రారాజు, చక్రవర్తిలా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.

Advertisement

Next Story