Britain King : బ్రిటన్‌కు కొత్త రాజు ? ఆయనకు పట్టాభిషేకం !

by Hajipasha |
Britain King : బ్రిటన్‌కు కొత్త రాజు ? ఆయనకు పట్టాభిషేకం !
X

దిశ, నేషనల్ బ్యూరో : క్యాన్సర్‌ కారణంగా బ్రిటన్ రాజు(Britain King) 76 ఏళ్ల ఛార్లెస్‌-3 ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో కొత్త ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. త్వరలోనే ఛార్లెస్‌ - 3 కుమారుడు, వేల్స్‌ యువరాజు విలియం‌కు బ్రిటన్ రాజుగా పట్టాభిషేకం(Britain Royal Family) జరుగుతుందంటూ అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రిన్స్ విలియం‌ రాజు అయితే, ఆయన సతీమణి కేట్‌ మిడిల్టన్‌(Kate Middleton) రాణి అవుతారు. రాయల్‌ బయోగ్రాఫర్‌ బెడెల్‌ స్మిత్‌ చెప్పిన వివరాల ఆధారంగా ఈ కథనాన్ని ప్రచురించామని ‘పీపుల్‌ మేగజైన్’ వెల్లడించింది.

‘‘ప్రస్తుత బ్రిటన్ రాజు ఛార్లెస్‌-3 క్యాన్సర్ చికిత్స కారణంగా కీలక బాధ్యతలన్నీ ప్రిన్స్ విలియం‌ నిర్వర్తిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే చాలా ముందుగానే విలియం-కేట్‌ బ్రిటన్‌ రాజు-రాణి అయ్యేలా ఉన్నారు. దీనికి వారు కూడా ఇప్పటినుంచే రెడీ అవుతున్నారు’’ అని బెడెల్‌ స్మిత్‌ చెప్పారని కథనంలో పేర్కొన్నారు.కాగా, ప్రిన్స్‌ విలియం సతీమణి కేట్‌ మిడిల్టన్‌ కూడా క్యాన్సర్‌ బారినపడ్డారు. కేట్‌ క్యాన్సర్‌ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రజాజీవితంలోకి వస్తున్నారు.

Advertisement

Next Story