Olymipics-2032 : 2032 ఒలంపిక్స్ లో క్రీడల్లో క్రికెట్..?

by M.Rajitha |   ( Updated:2024-12-12 10:34:57.0  )
Olymipics-2032 : 2032 ఒలంపిక్స్ లో క్రీడల్లో క్రికెట్..?
X

దిశ, వెబ్ డెస్క్ : 128 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్(Olympics) లో మళ్ళీ క్రికెట్ ను చేర్చబోతున్నారు. 2028 లాస్ ఏంజిల్స్(Loss Angels) ఒలంపిక్స్ లో ఈ క్రీడను ప్రవేశ పెట్టనున్నారు. అయితే అనంతరం 2032 బ్రిస్బేన్‌(Brisbane) ఒలింపిక్స్‌లో.. క్రికెట్‌కు అవ‌కాశం క‌ల్పించే అంశంపై ఐసీసీ చైర్మెన్ జే షా(ICC Chairman Jay Shah) ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ క‌మిటీ స‌భ్యుల‌తో మాట్లాడారు. లాస్ ఏంజిల్స్ క్రీడ‌ల‌కు ఓకే చెప్పినా.. బ్రిస్బేన్ క్రీడ‌లకు ఇంకా క‌న్ఫర్మేష‌న్ ద‌క్కలేదు. అయితే ఇవాళ బ్రిస్బేన్ అధికారుల‌తో జ‌రిగిన చ‌ర్చకు సంబంధించిన వీడియోను జే షా త‌న ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. బ్రిస్బేన్ ఆర్గనైనింగ్ క‌మిటీ చీఫ్ సిండీ హుక్‌, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హ‌క్లే ఆ మీటింగ్‌కు హాజ‌ర‌య్యారు. కాగా దీనిపై త్వరలోనే అధికారక ప్రకటన వెలువడనుందని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed