Bandi Sanjay : తెలంగాణలో సంస్కృతిపై దాడి జరుగుతోంది: కేంద్ర మంత్రి బండి సంజయ్

by Y. Venkata Narasimha Reddy |
Bandi Sanjay : తెలంగాణలో సంస్కృతిపై దాడి జరుగుతోంది: కేంద్ర మంత్రి బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో సంస్కృతిపై దాడి(Culture Aattack)జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయమైందని, బతుకమ్మ మన పండుగే కాదన్న ప్రచారం మొదలైందని, తెలంగాణ వేడుకలో జానపదం కనుమరుగైతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బాసరలో లడ్డూలు అందకుండా పోతున్నయని, కొమురవెల్లి ప్రసాదంలో నాణ్యత లేకుండా పోతుందని, వేములవాడలో మొక్కులు చెల్లించే కోడెలు మాయమైతున్నాయని, పండుగల మీద ఆంక్షలు పెరుగుతున్నయని, ఎక్కడపడితే అక్కడ ఆలయాలపై దాడులు జరుగుతున్నయని ఆయన విమర్శించారు.

ఆయా ఘటనలకు సంబంధించిన ఫోటోలను సంజయ్ తన ట్వీట్ లో పోస్టు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంస్కృతిపై జరుగుతున్న దాడులను, ఆయా ఘటనలను చూసీ చూడనట్టు వదిలేస్తోందా ? లేక, ప్రభుత్వమే ఈ సాంస్కృతిక దాడిని చేయిస్తోందా? అంటూ బండి సంజయ్ కీలక ప్రశ్నలు సంధించారు.

Advertisement

Next Story

Most Viewed