MP Balaram Naik : కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ ఫైర్

by Y. Venkata Narasimha Reddy |
MP Balaram Naik : కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఏర్పాటుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కు ఏం తెలుసని కాంగ్రెస్ ఎంపీ బలరాంనాయక్(MP Balaram Naik)మండిపడ్డారు. అసలు పార్లమెంటులో తెలంగాణ బిల్లు సమయంలో కేసీఆర్ పత్తా లేడన్నారు. ప్రజా ఉద్యమాలను, బలిదానాలను గౌరవించి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల పోరాటాన్ని మన్నించి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందన్న సంగతి అందరికి తెలుసన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాయడం హాస్యస్పదమని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సమస్యలుంటే రాహుల్ గాంధీ మమ్మల్నీ అడుగుతాడని, మేం ఆయనకు సమాధానం చెబుతామన్నారు. కేటీఆర్ కు ఎందుకని విమర్శించారు.

కేటీఆర్ కుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా ఎందుకని..దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడు నేను చెబుతా నీకు సమాధానమని మండిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. రైతులకు రూ.500బోనస్ ఇచ్చామని, రుణమాఫీ చేశామని, ధాన్యం తూకాల్లో కోతలు నివారించామని, మెస్ చార్జీలు పెంచామని, ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 15ఏండ్లు అధికారంలో ఉంటుందన్నారు.

Advertisement

Next Story