Karthika Deepam : కార్తీక్ ప్రేమ కురిపిస్తుంటే.. చెప్పలేని స్థితిలో ఉన్న దీప

by Prasanna |
Karthika Deepam : కార్తీక్ ప్రేమ కురిపిస్తుంటే.. చెప్పలేని స్థితిలో ఉన్న దీప
X

దిశ, వెబ్ డెస్క్ : కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

‘ఏంటి బావా.. నేను తెచ్చినవి ఏమి తీసుకోలేదు .. ఇప్పుడు నేను ఇచ్చిన కాంప్లిమెంట్స్ కూడా తీసుకోవా? నాకు అర్థమైందిలే.. సరే వెళ్దాం పదా బావా.. సరదాగా అలా బయటకు వెళ్ళి తిని ఇంటికి వెళ్దాం’ అని జ్యో అంటుంది . అయినా కూడా కార్తీక్ పట్టించుకోడు జ్యోని. లేదు ‘నేను ఇంటికి వెళ్లాలి చిన్న పని ఉంది ’ అని అంటాడు. ‘ఎవరి కోసం?’ అంటుంది జ్యో అడుగుతుంది. అదే సమయంలో ఫోన్ మోగుతుంది. లిఫ్ట్ చేసి ‘శౌర్య కాల్ చేసినట్లుంది’ అని అనుకుని స్పీకర్ లో పెడతాడు కార్తీక్. కానీ, ‘కార్తీక్ బాబు’ అని దీప అంటుంది. స్పీకర్‌లో దీప వాయిస్ విని.. జ్యో కోప పడుతుంది.

‘భలే టైమ్ కు ఫోన్ చేశావ్ .. ఇప్పుడు నా మరదలకు పేలిపోవాలని అంటాడు ’ అని మనసులో కార్తీక్ అంటాడు. ‘దీపా.. చెప్పు’ అని ప్రేమగా మాట్లాడతాడు. ‘మీరు రోజు వచ్చే టైమ్ కి రాలేదని కాల్ చేశాను’ అని దీప అంటుంది. ఇక జ్యో కూడా అక్కడే ఉండటంతో కార్తీక్ బిల్డప్ కొడుతోంది. ‘ఏంటి దీపా నువ్వు ఇంకా తినలేదా.. నేను రాలేదని నువ్వు తినకుండా ఉన్నావా .. అని అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి దీపా.. టైమ్‌కి తినకపోతే ఆరోగ్యం పాడవుతుంది. నీకు ఏమైనా అయితే నేను తట్టుకోగలనా?’ అని కార్తీక్, జ్యోకి కోపం వచ్చేలా మాట్లాడతాడు.

Advertisement

Next Story