- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మా హయాంలో నాణ్యమైన భోజనం పెట్టాం
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు ఎక్కువగా డిమాండ్ ఉండేదని,నాణ్యమైన భోజనంతో పాటు..ప్రమాణాలతో కూడిన విద్య అందించేవారని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలుషిత ఆహారం తిని.. అస్వస్థతకు గురై మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్,నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి లు గురువారం సాయంత్రం పరామర్శించి మీడియాతో మాట్లాడారు. ఫుడ్ పాయిజన్‌తో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మాగనూర్ పాఠశాలకు చెందిన విద్యార్థులకు ఇచ్చిన అల్పాహారంలో పురుగులు బయటపడ్డాయని ఆరోపించారు. సర్కార్ పర్యవేక్షణ కొరవడటంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే రాంమ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..నారాయణపేట జిల్లాలో విద్య,వైద్యం నిర్వాహణ అధ్వాన్నంగా ఉందని,ఎవ్వరూ పట్టించుకోవడంలేదని విమర్శించారు. నారాయణపేటలో వైద్య సదుపాయాలు లేక మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో విద్యార్థులు చికిత్స పొందుతున్నారని ఆరోపిస్తూ..ముఖ్యమంత్రి,మంత్రుల పిల్లలు ఇలాంటి భోజనమే తింటారా అని ఆయన ప్రశ్నించారు.