- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారుల అవగాహన లోపం.. కుల గణన ఎన్యుమరేటర్లకు కష్టాలు..
దిశ, మక్తల్ : అధికారులు అవగాహన లోపం వల్ల కొంత మంది టీచర్లకు, ఎన్యుమరేటర్లకు కష్ఠాలు తెచ్చి పెట్టాయి. తాము పనిచేస్తున్న గ్రామంలో లేదంటే పక్క గ్రామంలో ఎన్యుమరేటర్లుగా విధులు కేటాయించాలని ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కాని మండలంలోని అధికారుల అవగాహన లోపం వల్ల తాము పనిచేస్తున్న పాఠశాలలో కాకుండా దాదాపు 15 కిలోమీటర్ల దూరంలొ ఉన్న గ్రామానికి వెళ్ళి కులగణన చేయాలని టీచర్లకు విధులను కేటాయించారు. దీనితో రోజు ఉదయం పాఠశాలకు హజరై మధ్యాహ్నం కులగణన చేయడానికి అలాట్ చేసిన గ్రామాలకు వెళ్లి సర్వే చేయాల్సి వస్తుంది.
వారి వివరాల్లోకెళితే భీమేష్ ఎస్జీటీ గడ్డంపల్లి నుండి దాసరి దొడ్డి, మైభయ్యా ఎల్ఎఫ్ హెచ్ఎం సత్యవార్ నుండి రుద్రసముద్రం, రాఘవేందర్ ఎస్జీటి పసుపుల నుండి రుద్రసముద్రం, కవిత ఎస్జీటి టేకులపల్లి నుండి సంగంబండ, రవీందర్ ఎల్ఎఫ్ హెచ్ఎం ఉప్పరపల్లి నుండి సంగం బండ, రాకేష్ ఉప్పరపల్లి నుండి సంగం బండకు పావని ఉప్పర్పల్లి నుండి సంగం బండ, బాల్ రాజ్ సామన్ పల్లి నుండి మక్తల్ కు కులగణన చేయాలని మండల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఎనిమిది మంది టీచర్లు తాము పని చేస్తున్న గ్రామం నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరం వెళ్లి సర్వే చేయాల్సి ఉంటుంది.