- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలకార్మిక వ్యవస్థను అరికట్టాలి
దిశ, గద్వాల కలెక్టరేట్ : జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను, బాల్య వివాహాలను అరికట్టేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సంరక్షణ కోసం జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గట్టు, కేటిదొడ్డి, మల్దకల్ మండలాల్లో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అందుకు గాను గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి డ్రాపవుట్ అయిన పిల్లలు తిరిగి పాఠశాలల్లో చేరే విధంగా కృషి చేయాలన్నారు.
బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు పోలీసు శాఖ కూడా పూర్తి సహకారం అందించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు బడి మానేసిన 945 పిల్లలను గుర్తించి, వారికి కౌన్సెలింగ్ నిర్వహించి 800 మందిని తిరిగి పాఠశాలల్లో చేర్పించినట్లు తెలిపారు. రెస్క్యూ చేసిన బాల కార్మికులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పాఠశాలల్లో వెంటనే చేర్చుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
అనంతరం అధికారులతో కలిసి ప్రతిక్షణం అప్రమత్తం... సురక్షితం... అనే కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు, జెడ్పీ సీఈఓ కాంతమ్మ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, లేబర్ ఆఫీసర్ మహేష్ కుమార్, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ప్రియాంక, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు రమేష్ బాబు, సరోజ, డీసీపీఓ నరసింహ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు జయ భారతి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవి, సీడీపీఓలు, వైద్య, పోలీసు, వివిధ శాఖల సహాయ అధికారులు పాల్గొన్నారు.