- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Arrest : చోరీ కేసులో నిందితుల అరెస్ట్
దిశ, నారాయణపేట క్రైమ్: నారాయణపేట జిల్లా మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్గా చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ఎట్టకేలకు మరికల్ పోలీసులు పట్టుకొని వారి నుంచి 5.3 తులాల బంగారం... 30 తులాల వెండి రికవరీ చేసినట్లు డీఎస్పీ లింగయ్య తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం స్థానిక మరికల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డి.ఎస్.పి వెల్లడించారు. మరికల్ గ్రామానికి చెందిన హనుమంతు ఇంట్లో గత ఐదు రోజుల క్రితం చోరీ జరిగిందని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న మూడు గ్రాముల బంగారం, 20 తులాల వెండి అపహరణకు గురైనట్లు కేసు నమోదయిందన్నారు.
ఈ చోరీకి పాల్పడింది మక్తల్ మండలం చందాపూర్ గ్రామానికి చెందిన పాత నేరస్థుడు తమ్మిరెడ్డి నర్సింలు తోపాటు ఈయనకు సహకరించిన వడ్వాట్ గ్రామానికి చెందిన కోల్పూర్ నరసింహ ను విచారించగా చోరీ చేసినట్లు రుజువైందన్నారు. అలాగే గత ఏడాది మరికల్ మండలం పూసలపాడు గ్రామంలో మరోచోటికి కోల్పూర్ నరసింహ పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. ఈ నిందితుల నుంచి చోరీ సొత్తును రికవరీ చేసి నిందితులను రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.. కేసులను ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ రాజేందర్ ఎస్సై మురళి కానిస్టేబుళ్లు తిరుపతిరెడ్డి రవీందర్ లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు పురస్కారాన్ని అందించారు.