యథేచ్ఛగా గుట్కా దందా…నామమాత్రంగా అధికారుల తనిఖీలు

by Kalyani |   ( Updated:2024-08-31 14:46:08.0  )
యథేచ్ఛగా గుట్కా దందా…నామమాత్రంగా అధికారుల తనిఖీలు
X

దిశ, నాగర్ కర్నూల్ : నిషేధిత గుట్కా అమ్మకాలు నాగర్ కర్నూల్ జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గుట్కా, పాన్ మసాలా వంటి వాటిని నిషేధం విధించింది. రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన కొందరు అక్రమార్కులు విక్రయాలు చేపడుతున్నారు. హైదరాబాద్ నుంచి పట్టణాలకు,పట్టణాల నుంచి మారుమూల పల్లెలకు గుట్కా రవాణా చేస్తున్నారు. కిరాణా షాపు, పాన్ షాపుల్లో బహిరంగంగానే అమ్ముతున్నారు. అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో గుట్కా వ్యాపారులు రెచ్చిపోతున్నారు. గుట్కా వ్యాపారులు అధికారుల చేతులు తడుపుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో మూడు సంచులు ఆరు ప్యాకెట్లుగా దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. జిల్లాలో ప్రతి కిరణా షాపు పాన్ షాపుల్లో గుట్కా కైని పాన్ మసాలా వంటి వాటివి ఉన్న అధికారులు తనిఖీలకు వస్తే మాత్రం అవి కనిపించవు. గుట్కా వ్యాపారులకు ముందస్తుగానే అధికారులు తనిఖీలకు వస్తున్నట్లు సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ గుట్కా కు యువత నుంచి వృద్ధుల వరకు బానిసలు అవుతున్నారు. యువత వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒకసారి గుట్కా అలవాటు అయితే వాటిని మానేసి పరిస్థితి ఉండదు. అదే అదునుగా భావించి యథేచ్ఛగా దందా సాగుతుంది. అధిక రేట్లు కూడా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ గుట్కా పాన్ మసాలా తినేవారు నోటి క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రజా ఆరోగ్యాన్ని హాని చేసే గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గుట్కా కు బానిస అవుతున్న యువత

యువత గుట్కా కు బానిస అవుతున్నారు. కొందరు ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు నోట్లో గుట్కా పాన్ మసాలా లేనిది ఉండలేకపోతున్నారు. 10 రూపాయలకు దొరికే గుట్కాను 20 రూపాయలకు అమ్ముతున్నారు. జిల్లా కేంద్రానికి చదువుకోవడానికి వచ్చే స్కూల్ విద్యార్థులు గుట్కా, సిగరెట్ వంటి చెడు అలవాట్లకు కు బానిస అవుతున్నారు.

అధిక ధరలకు విక్రయం..

రాష్ట్ర ప్రభుత్వం పొగాకు, నికోటిన్ కలిగిన ఉత్పత్తులను నిషేధించింది. వాటితో తయారై ఉత్పత్తులు జిల్లాలో ప్రధానంగా అంబర్, ఆర్ఆర్, అనార్, పాన్ బహార్, విమల్, బాహుబలి ఉన్నాయి. నిషేధానికి ముందు అంబర్, ఆర్ఆర్, అనార్ వంటి పొగాకు పొట్లాలు రూ.15కు లభించగా ప్రస్తుతం వాటి ధర రూ.30 నుంచి రూ.40 వరకు ఉంది. పాన్ బహార్, విమల్, బాహుబలి వంటి పౌచ్లు రూ.10కి లభించగా ఇప్పుడు రూ.20నుంచి రూ.30కు విక్రయిస్తున్నారు. పట్టణంలోని హోల్ సేల్ వ్యాపారులు ఒక్కో బస్తా ధర డబుల్ చేయడం మూలంగానే అధిక ధరలకు అమ్ముతున్నారని గుట్కా ప్రియుల ద్వారా తెలిసింది.

నామమాత్రంగా అధికారుల తనిఖీలు

పోలీసు అధికారులు అప్పుడప్పుడు దుకాణాలపై దాడులు నిర్వహించి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని అన్ని పాన్ షాపుల్లో విచ్చలవిడిగా గుట్కా పాన్ మసాలా అమ్ముతున్న ఏ ఒక్క అధికారి కూడా తనిఖీ చేయకపోవడం గమనార్హం.స్థానికులు సమాచారం ఇస్తే రేపు దాడులు చేస్తామంటూ దాటా వేస్తున్నారు. గుట్కా పాన్ మసాలాకు స్కూల్ విద్యార్థులతో పాటు కాలేజీ విద్యార్థులు మైనర్ బాలులు అలవాటు పడుతున్నారు. వీటిపై అధికారులు చర్యలు తీసుకుని దాడులు నిర్వహించాలని పట్టణవాసులు కోరుతున్నారు

అక్రమ దందాను అరికట్టేందుకు చర్యలు :


అమ్ముతున్నట్టు ఫిర్యాదులు వస్తే కచ్చితంగా దాడులు చేస్తాం. మేలో జిల్లా కేంద్రంలోని హోల్సేల్ వ్యాపారి నుంచి దాడులు చేసి గుట్కా పాన్ మసాలా వంటి సొమ్మును రికవరీ చేసుకుంటే అతను హైకోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకొని సొమ్మును తీసుకున్నాడు. టొబాకో కింద ఉండాలి, ఫుడ్ ఇన్స్పెక్టర్ సర్టిఫై చేయాలి అప్పుడే మనం దాడులు నిర్వహించడానికి వస్తుంది. త్వరలో జిల్లాలో తనిఖీలు చేపిస్తాం.

కనకయ్య, సీఐ, నాగర్ కర్నూల్.

Advertisement

Next Story

Most Viewed