- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలను విస్తృతపరచాలి: సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి
దిశ, మహబూబ్ నగర్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ లా సేవలను విస్తృతపరచాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి సూచించారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు సోమవారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యాలయంలో పానెల్ లాయర్లు, పారా లీగల్ వాలంటీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెలవారి కార్యక్రమాలు, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ల ఏర్పాటు, రైతులకు అందించాల్సిన న్యాయ సహాయం, దిశా చట్టం, ప్రోబోనో టేలీల యాప్ సేవలను వివరించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో దేవరకద్ర మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించనున్నట్లు, త్వరలో కోయిలకొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో అగ్రి లీగల్ పెయిడ్ క్లినిక్ ను ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ క్లినిక్ ల ద్వారా వారానికి రెండు రోజులు నియమించిన పారా లీగల్ వాలంటీర్లు రైతులకు న్యాయ సలహాలు, సూచనలు ఇవ్వాలని, అక్కడ పరిష్కరించలేని వాటిని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ దృష్టికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని జడ్జి సూచించారు. ఈ సమావేశంలో పానెల్ లాయర్లు, పీఎల్వీ లు పాల్గొన్నారు.