- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసిస్‌తో ఒవైసీకి లింకు పెట్టిన మాధవీ లత.. ఏమన్నారంటే..
దిశ, నేషనల్ బ్యూరో : హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీ లత.. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన ఒవైసీకి ఐసిస్‌కు చెందిన వాళ్లు, కింగ్స్ గ్రూపునకు చెందిన వాళ్లు స్నేహితులుగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని చంపేస్తామని బెదిరించే వాళ్లు ఇంకెవరు ఉంటారు ?’’ అని ఆమె ప్రశ్నించారు. యూపీలోని దివంగత ముఖ్తార్ అన్సారీ కుటుంబాన్ని పరామర్శించినప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఇటీవల అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. దీనికి కౌంటర్‌గా మాధవీ లత తాజా కామెంట్స్ చేశారు. ‘‘అసదుద్దీన్ ఒవైసీ ఫ్రెండ్స్ సర్కిల్ అంతుచిక్కని రేంజులో ఉంది. హైదరాబాద్‌లో ఆయనకు బలమైన కోట ఉంది. అయినప్పటికీ ప్రాణహాని ఉందని ఒవైసీ చెబుతుండటం విడ్డూరంగా ఉంది’’ అని మాధవీ లత విమర్శించారు. కాగా, ఇటీవల తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌పై రివ్యూ చేయాలని మజ్లిస్ చీఫ్ ఒవైసీ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ‘‘విధి నిర్ణయించిన టైంలోనే చావు వస్తుంది. కానీ ఎన్నికల వేళ ఇలాంటి బెదిరింపు వ్యవహారాలకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంటుంది. ఇలాంటి అరాచకాలు దేశంలో జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈసీదే’’ అని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.