Liquor policy : లిక్కర్ పాలసీ సీబిఐ కేసు విచారణ నవంబర్ 21 కి వాయిదా

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-12 09:03:05.0  )
Liquor policy : లిక్కర్ పాలసీ సీబిఐ కేసు విచారణ నవంబర్ 21 కి వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ పాలసీ(Liquor policy), మనీ లాండరింగ్ కేసులో సీబీఐ(CBI) కేసు విచారణను కోర్టు నవంబర్ 21కి వాయిదా వేసింది. కేసు విచారణకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, సహా ఇతర నిందితులు వర్చువల్ గా హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లపై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ కొనసాగుతోన్న విషయం విదితమే. కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌ తో పాటు మనీలాండరింగ్‌ అభియోగాలపై ఈడీ, సీబీఐ కేసుల్లో నిందితులు విచారణ ఎదుర్కొంటున్నారు.

కేసులో గత 2 ఏళ్లుగా జైలులో ఉన్న మనీష్ సిసోడియాకు, కొన్ని నెలలు జైలు జీవితం గడిపిన ఎమ్మెల్సీ కవితకు, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా కొన్ని రోజుల క్రితమే బెయిల్ వచ్చింది. బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

Advertisement

Next Story