బీఆర్ఎస్‌ ‘కారు’ సర్వీసింగ్‌కు వెళ్లింది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2024-01-12 10:37:53.0  )
బీఆర్ఎస్‌ ‘కారు’ సర్వీసింగ్‌కు వెళ్లింది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఓటములు బీఆర్ఎస్‌కు కొత్త కాదని.. కారుకు ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని అన్నారు. కారు సర్వీసింగ్‌కు వెళ్లింది.. షెడ్డుకు కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్విరామంగా పదేళ్ల పాటు కారు విరామం లేకుండా పనిచేసిందని గుర్తుచేశారు. మరింత స్పీడ్‌గా దూసుకెళ్లేందుకు ప్రస్తుతం సర్వీసింగ్‌కు వెళ్లిందని వ్యాఖ్యానించారు. పదేళ్ల పాటు పాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదని.. అందుకు నాదే బాధ్యత అని కేటీఆర్ ఒప్పుకున్నారు.

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం సరికాదని అన్నారు. పదేళ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా దళితబంధు కొందరికే రావడంతో మిగిలిన వాళ్లు వ్యతిరేకమయ్యారని చెప్పారు. దళితబంధుపై ఇతర కులాల్లోనూ వ్యతిరేక కనిపించిందని అన్నారు. భూ స్వాములకు రైతుబంధు ఇవ్వడానికి చిన్న రైతులు ఒప్పుకోలేదని తెలిపారు. పథకాలపై ప్రజా వ్యతిరేకతను సరిగ్గా అంచనా వేయలేకపోయామని చెప్పారు.

Also Read..

సొంత లీడర్లకు కేటీఆర్ వార్నింగ్.. ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దని సూచన

Advertisement

Next Story