ఏపీలో గెలిచేది ఆ పార్టీనే.. సంచలన జోస్యం చెప్పిన కేటీఆర్..!

by Satheesh |   ( Updated:2024-05-15 14:38:01.0  )
ఏపీలో గెలిచేది ఆ పార్టీనే.. సంచలన జోస్యం చెప్పిన కేటీఆర్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు ముగియడంతో ఇక ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై స్టేట్ పాలిటిక్స్‌లో జోరుగా చర్చ మొదలైంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? ఏ పార్టీ అధికార పగ్గాలు చేపడుతుంది..? ఏపీ నెక్ట్స్ సీఎం ఎవరూ అవుతారు..? అనే అంశాలు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి జగన్ గెలుస్తున్నాడని జోస్యం చెప్పారు. ఈ మేరకు తమకు సమాచారం ఉందని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసీపీనే మరోసారి గెలుస్తుందనే కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా కేటీఆర్ సైతం జగన్‌నే గెలుస్తాడని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. మరీ కేసీఆర్, కేటీఆర్ చెప్పింది నిజం అవుతుందో లేదో చూడాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed