- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రగతిభవన్‌లో KTR, హరీశ్‌రావు భేటీ.. కౌంటర్ స్ట్రాటజీపై ప్లాన్..!
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ సరళిపైనా, వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌పైనా ప్రాథమిక స్థాయిలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రగతిభవన్‌లో చర్చించుకున్నారు. సాయంత్రానికి ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు వెళ్లి కేసీఆర్‌తో రివ్యూ చేయనున్నారు. ఏయే నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి ఎలా ఉన్నది, ఎంత శాతం నమోదైంది, అనుకూల ప్రతికూలత అంశాలు ఎలా ఉన్నాయి, ఎగ్జిట్ పోల్స్‌లో వెలువడిన వివరాలతో పోల్చి సమీక్షించనున్నారు. ఈ నెల 3న కౌంటింగ్ జరగనుండడంతో తదుపరి కార్యాచరణపైనా ఈ ముగ్గురూ సాయంత్రం మరింత లోతుగా రివ్యూ చేయనున్నారు. ఒక్కో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కో తీరులో ఉండడంతో సొంత సర్వే సంస్థ వెల్లడించిన వివరాలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులను పరిగణనలోకి తీసుకుని సమీక్షించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
పోలింగ్ ట్రెండ్‌పై చర్చ
నియోజకవర్గాలవారీగా పోలింగ్ ట్రెండ్‌ను పరిశీలించి అందులో బీఆర్ఎస్‌కు ఎన్ని ఓట్లు పడే అవకాశమున్నది, లబ్ధిదారుల ఆలోచన ఏ తీరులో ఉన్నది తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. వీక్‌గా ఉన్న స్థానాల్లో విజయావకాశాలు, టైట్ ఫైట్ ఉన్న స్థానాలు, చివరి గంటల్లో జరిగిన పోలింగ్ ద్వారా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు ఎలా భిన్నంగా ఉండే అవకాశమున్నది తదితర అంశాలపైనా లోతుగా చర్చించడానికి ఈ సమావేశాన్ని ఖరారు చేసుకున్నట్లు సమాచారం. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ గతంకంటే కాస్త బలపడిన వాతావరణం కనిపిస్తున్నందున ఏయే నియోజకవర్గాల్లో ఇబ్బందులుండొచ్చు, ఎన్ని స్థానాల్లో గెలుపొందే అవకాశాలున్నాయనేదానిపై లెక్కల కసరత్తు చేయనున్నట్లు తెలిసింది.
ఏ జిల్లాలో ఎలా ఉంది?
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్‌కు ఎక్కువ స్థానాలు రానున్నందున.. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌గర్ తదితర ఉమ్మడి జిల్లాలో కోల్పోయే స్థానాలతో వచ్చే చిక్కులపైనా చర్చ జరుగనున్నట్లు తెలిసింది. ఆయా సెగ్మెంట్ల అభ్యర్థులతో పాటు నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, వార్ రూమ్ నుంచి సమన్వయం చేసిన నేతల అభిప్రాయాలను కూడా తీసుకోనున్నట్లు తెలిసింది.
ఎమ్మెల్సీ కవిత ఇన్‌చార్జిగా వ్యవహరించిన స్థానాలతోపాటు ప్రచారంలో పాల్గొన్న సెగ్మెంట్లకు సంబంధించిన సమాచారంపైనా చర్చ జరగనున్నది. ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనా వివరాలతో గాభరా పడొద్దని పార్టీ నేతలకు మెసేజ్‌లు పంపి కౌంటింగ్ తర్వాత ఎలాంటి పరిణామాలు తలెత్తే అవకాశమున్నదో, దానికి కౌంటర్ స్ట్రాటెజీ ఎలా ఉండాలో ప్లానింగ్ చేయడంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.