బీజేపీ ఆఫీస్ కు కోన వెంకట్

by M.Rajitha |
బీజేపీ ఆఫీస్ కు కోన వెంకట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖ డైరెక్టర్ కోన వెంకట్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బుధవారం వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆయన పార్టీ కార్యాలయానికి రావడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయంలో 15 ఏళ్ల స్ఫూర్తి అనే యువతి తీసిన షార్ట్ ఫిల్మ్ ను కిషన్ రెడ్డి రిలీజ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అనేక సామాజిక సినిమాలు తీసి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి కోన వెంకట్ అని కిషన్ రెడ్డి కొనియాడారు. షార్ట్ ఫిలిం చాలా సందేశాత్మకంగా ఉందన్నారు. కాలుష్యం మానవాళికి ప్రమాదకరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. యువతలో సామాజిక స్పృహ పెరగాలన్నారు. థర్మల్ పవర్ ద్వారా ఉత్పత్తి అవుతున్న వస్తువులను నిషేధించే పనిలో ప్రపంచ దేశాలు ఉన్నాయని, థర్మల్ పవర్ రానున్న రోజుల్లో దేశానికి చాలెంజ్ గా ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో 85 శాతం బొగ్గు ఆధారిత విద్యుత్ ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. తనతో ప్రధాని మోడీ బొగ్గు, గనుల శాఖ ఎక్కువ రోజులు ఉండదని చెబుతుంటారని, ఎందుకంటే రానున్న రోజుల్లో ఆ శాఖ రెన్యూవబుల్ ఎనర్జీ శాఖగా షిఫ్ట్ అవుతుందని చెబుతుంటారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఎన్విరాన్‌మెంట్, ఎనర్జీ, గ్రీనరీ, వాటర్ ను యథేచ్ఛగా వినియోగిస్తున్నామని, అవసరానికి తగినంతగా వాడుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed