Kishan Reddy: టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయాలు.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Shiva |
Kishan Reddy: టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయాలు.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మొదటి సమావేశంలోనే టీటీడీ (TTD) పాలక మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. మొదటగా శ్రీవాణి ట్రస్టు (Srivani Trust)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీవారి దర్శనం కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తులకు రెండు, మూడు గంటల్లోనే దర్శనం కల్పించేలా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనుంది. అదేవిధంగా టీటీడీ (TTD)లో విధులు నిర్వర్తిస్తున్న అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ (VRS) ఇవ్వాలని లేనిపక్షంలో ఇతర ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా, టీటీడీ (TTD) పాలకమండలి తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ బోర్డు (TTD Board) తీసుకున్న నిర్ణయాలను తాము స్వాగతిస్తున్నామని అన్నారు. కొత్తగా ప్రవేశపెట్టబోయే సంస్కరణలు ఆహ్వానించదగిన పరిణామమని అన్నారు. అన్యమత ఉద్యోగులను టీటీడీ(TTD)లో పని చేయనివ్వకుండా ఇతర ప్రభుత్వ శాఖలకు ట్రాన్స్‌ఫర్ చేయడం సబబేనని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ ఆలయాల్లో ఇలాంటి పద్ధతినే అవలంభించాలంటూ ప్రభుత్వాలను కోరుతున్నానని కిషన్‌రెడ్డి అన్నారు.

టీటీడీ బోర్డు నిర్ణయాలివే..

* ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజన్స్ (Artificial Intelligence) సాయంతో 2, 3 గంటల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం అయ్యేలా నిపుణుల కమిటీ ఏర్పాటు.

* దేవలోక్‌ (Devalok)కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని టీటీడీ (TTD)కి ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయం.

* తిరుమల (Tirumala)లో రాజకీయాలు మాట్లాడే వారిని, ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం.

* శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆ కోటాను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం.

* తిరుమ‌ల‌(Tirumala)లో గోగ‌ర్భం డ్యామ్ (Gogarbham Dam) వ‌ద్ద విశాఖ శార‌ద పీఠానికి చెందిన మ‌ఠం నిర్మాణంలో అవ‌క‌త‌వ‌క‌లు, ఆక్రమ‌ణలు జ‌రిగిన‌ట్లు టీటీడీ (TTD) అధికారుల క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భ‌వ‌నం లీజును ర‌ద్దు చేయాల‌ని నిర్ణయం.

* బ్రహ్మోత్సవాల్లో విశేష సేవ‌లు అందించిన రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌కు రూ.15,400, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు రూ.7,535 బ్రహ్మోత్సవ బ‌హుమానం.

* శ్రీ‌వారి ఆల‌యంలో లీకేజీల నివార‌ణ‌, అన్న ప్రసాద కేంద్రం ఆధునీక‌ర‌ణ‌కు టీవీఎస్ (TVS) సంస్థతో ఎంఓయూ చేసుకోనున్నారు.

Advertisement

Next Story