- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా ఎప్పుడంటే..?
దిశ, వెబ్‌డెస్క్: మేడిగడ్డ బ్రిడ్జి కుంగిన ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మూడేళ్లలోనే బ్రిడ్జి కుంగిపోవడం దారుణమని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్టర్ ప్లాఫ్ అయిందని, ప్రాజెక్ట్ భద్రతపై దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ము వృధా చేశారని, ప్రాజెక్టును పరిశీలించేందుకు డ్యామ్ సేఫ్టీ అథారిటీని పంపాలని కేంద్ర జలశక్తి శాఖను కోరుతానని తెలిపారు.
దసరా తర్వాత తెలంగాణ బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. తొలి జాబితాలో బలమైన అభ్యర్థులకు సీటు కేటాయించామని, బీఆర్ఎస్‌పై ఉన్న వ్యతిరేకతను తమవైపు తిప్పుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. దసరా తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తామని, ఒక్కసారి అవకాశం కల్పించాలని ప్రజలను కోరుతామని తెలిపారు. ఈ నెల 27న అమిత్ షా ప్రచారంలో పాల్గొంటారని, చివరివారంలో యోగి ఆదిత్యనాథ్ వస్తారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.