- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీఆర్ఎస్ కు ముగ్గురు కౌన్సిలర్ల రాజీనామా
దిశ, వైరా:వైరా మున్సిపాలిటీలోని ముగ్గురు కౌన్సిలర్లు, పార్టీ పట్టణాధ్యక్షుడు తో పాటు సుమారు 100 కుటుంబాల వారు బీఆర్ఎస్ పార్టీకి మంగళవారం సాయంత్రం రాజీనామా చేశారు.మండల కేంద్రంలోని వాసవీ కళ్యాణ మండపంలో సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు బీఆర్ఎస్ పార్టీకి తమ రాజీనామాను అందజేశారు. వైరా మున్సిపాలిటీ లోని 7, 8, 20 వార్డు కౌన్సిలర్లు పణితి ఉష, కన్నెగంటి సునీత, గుగులోతు లక్ష్మీబాయి, బీఆర్ఎస్ వైరా పట్టణాధ్యక్షుడు దార్న రాజశేఖర్ తో పాటు సుమారు 100 కుటుంబాలకు చెందిన వారు బీఆర్ఎస్ పార్టీకి తమ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా శ్రీనివాసరెడ్డికి ఎలాంటి పదవి కేటాయించకపోగా, ఆయనను అనేక అవమానాలకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పొంగులేటి వర్గీయులుగా ఆయన అనుచర వర్గంలో చేరేందుకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పణితి సైదులు, కన్నెగంటి హుస్సేన్, పోటు మధు, చెరుకూరు శ్రీను, వీరంశెట్టి సీతారాములు, ధారా వెంకన్న, వెంకటాచారి, సరిపూడి కోటేశ్వరరావు, పణితి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.