- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికార పార్టీ నాయకుల పెత్తనం.. ప్రజలను బెదిరింపు
దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం నగరంలోఅధికార పార్టీ నాయకుల పెత్తనం కొనసాగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మూడో పట్టణ ప్రాంతంలో సుందరయ్య నగర్ గల డివిజన్‌లో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు పెత్తనం చేస్తే.. తానే చేయాలంటూ హుకుం జారీ చేస్తూ గోలపాడు ఛానల్ నిర్వాసితులపై పెత్తనం చేస్తూ స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గొల్లపాడు ఛానల్ అభివృద్ధి పేరుతో సుమారు రూ 100 కోట్లతో పనులు చేస్తున్న సంగతి విధితమే. దీనిని ఆసరాగా చేసుకున్న ఆ డివిజన్ అధ్యక్షుడు హోదాలో ఉన్న అధికార పార్టీ నాయకుడు చానల్ కి దగ్గర్లో ఉన్న నిర్వాసితులను బెదిరింపులకు గురిచేస్తూ పక్కనే ఉన్న రోడ్డును తనకు ఇష్టం వచ్చిన విధంగా మార్చేస్తా అంటూ బెదిరిస్తున్నాడు. మీ ఇల్లు సరిగ్గా ఉండాలంటే తనకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినపడుతున్నాయి.
గొల్లపాడు కెనాల్ పక్కన అభివృద్ధి చేయగా మిగిలిన మొత్తం 30 అడుగుల రోడ్డు విస్తీర్ణం ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటే ఆ డివిజన్ ప్రాంతంలో మాత్రం కొన్నిచోట్ల 28 అడుగులు, ఇరవై ఐదు అడుగులు ఒక్కోచోట ఒక్కో విధంగా రోడ్డు విస్తీర్ణం తగ్గించి పేదల పాలిట శాపంగా మారారని ప్రజలు వాపోతున్నారు. ఎవరైనా ఇదేమని అడిగితే వారిపై పోలీసు కేసులు పెట్టి ఇస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ట్లు అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. మంత్రి ఆశయాలను తుంగలో తొక్కుతూ అధికార పార్టీ నాయకుడంటూ పేద ప్రజలకు శాపంగా మారాడు. ఈ డివిజన్ లో ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్ ఉన్నా కానీ వారు నిర్వహించాల్సిన విధులు మొత్తం ఇతనే నిర్వహిస్తూ కార్పొరేటర్ ను సైతం బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. వికలాంగురాలు అని చూడకుండా ఆమె వద్ద నుండి డబ్బులు ఆశించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్న జిల్లా మంత్రికి కలంకం తెచ్చేలా ఈ నాయకుడు చేస్తున్న పనులపై ప్రజలు తిట్టిపోస్తున్నారు. పార్టీ పదవిలో ఉంటేనే ఇంత చేస్తుంటే.. ఇతను అదే డివిజన్ కార్పొరేటర్ అయితే మాత్రం ఏమి చేసే వాడో అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఇప్పటికైనా ఇలాంటి నాయకులపై చర్యలు తీసుకొని పేద ప్రజల పాలిట దోషులను పార్టీ నుండి తొలగించాలని కోరుతున్నారు ప్రజలు.