- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
వైరా ఎమ్మెల్యే రాములు నాయక్
దిశ, వైరా: రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. మండల పరిధిలోని విప్పలమడకలో నెలకొని ఉన్న సోమలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శనివారం రాత్రి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యేకు దేవాలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ వీరపనేని చెన్నకేశ్వర్లు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి బావాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. ఆధ్యాత్మిక చింతన తోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని పేర్కొన్నారు. విప్పలమడక గ్రామ ఆలయానికి ఎంతో పురాతన ఘన చరిత్ర ఉందన్నారు.
విప్పలమడక గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చెస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైరా జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే రత్నం, బీఆర్ఎస్ మండల పట్టణాధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, మద్దెల రవి, సర్పంచ్ తుమ్మల జాను పాపయ్య, ఎంపీటీసీ బూర్గు సంజీవరావు, దేవాలయ చైర్మన్ వీరపనేని చెన్నకేశవులు, మాజీ సర్పంచ్ లు పారుపల్లి కృష్ణారావు, కొల్లి కొండ వీరభద్రం, మాజీ ఎంపీటీసీ ఆకుల ప్రసాద్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దేవభక్తిని చిన్న సాంబశివరావు, నాయకులు మచ్చా వెంకటేశ్వరరావు, కట్టా కృష్ణర్జునరావు, తదితరులు పాల్గొన్నారు.
- Tags
- MLA Ramulu Nayak