Tpcc Chief: టీపీసీసీ ఇంటలెక్చువల్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం

by Prasad Jukanti |
Tpcc Chief: టీపీసీసీ ఇంటలెక్చువల్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం
X

దిశ, డైనమిక్ బ్యూరో: గాంధీ భవన్ (Gandhi Bhavan) లో టీపీసీసీ ఇంటలెక్చువల్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. టీపీసీసీ ఇంటలెక్చవల్ కమిటీ (TPCC Intellectual Committee) చైర్మన్ ఆనంతుల శ్యామ్ మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక న్యాయాన్ని కులగణన ద్వారా అందించాలని రాహుల్ గాంధీ తాపత్రయ పడుతున్నారని చెప్పారు. ఇంటువంటి సందర్భంలో ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో కులగణన నిర్వహించడం హర్షించదగిన విషయం అన్నారు. కులగణనలో రాష్ట్ర ప్రభుత్వం బ్రాండ్ అంబసీడర్ గా మారిందన్నారు. ప్రతి తరగతిలో భారత రాజ్యాంగం పీఠిక ఉండేలా ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.



Next Story

Most Viewed