- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానం : ఎమ్మెల్యే రాములు నాయక్
దిశ, వైరా : భారతదేశంలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాల పరంగా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. వైరా నియోజకవర్గంలోని ఏన్కూర్ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే రాములు నాయక్ పర్యటించారు. తూతక్క లింగన్నపేట, బురద రాఘవాపురం, ఎర్రబోడు తండా, తిమ్మారావుపేట, రాయమాదారం తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే రాములు నాయక్ పర్యటన కొనసాగింది. ఆయా గ్రామాల్లో స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రాములు నాయక్ పంపిణీ చేశారు. అదేవిధంగా అనారోగ్య బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనారోగ్య బాధితులకు ధైర్యం చెప్పి తానున్నానని భరోసాను కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ఫలాలను ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. నియోజకవర్గంలోని ప్రతి సంక్షేమ పథక లబ్ధిదారుడి ఇంటికి తానే స్వయంగా వెళ్లి చెక్కులు పంపిణీ చేస్తానని పేర్కొన్నారు. వైరా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే రాములు నాయక్ కు గ్రామస్తులు వివరించగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షులు బానోత్ సురేష్ నాయక్ , ఏన్కూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్యా లాలు నాయక్ , రైతుబంధు అధ్యక్షులు మేడా ధర్మారావు , మండల ఉపాధ్యక్షులు పూర్ణ కంటి మైసారావు, సర్పంచులు భూక్యా కాంతి బాలాజీ నాయక్, బానోత్, వీరభద్రం, బానోత్ కృష్ణప్రియ, శ్రీకాంత్, ఆర్ ఎం సుహాసిని, భూక్యా జగ్గయ, ముక్తి లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ పాశం శ్రీను, సొసైటీ డైరెక్టర్లు వర్ధ బోయిన శ్రీను, కొనకంచి వెంకటేశ్వర్లు, నాయకులు కట్టా సత్యనారాయణ, భూక్యా చందులాల్ ,కడియాల సుధాకర్, ఈశ్వర్ నాయక్, ఆరం నాగేశ్వరరావు, ఇసనేపల్లి నాగేశ్వరరావు, కోల గోపినాథ్, ఎలమద్ది జనార్ధన్, భూక్య సక్రా, మాచినేని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.