లక్ష్యసాధనకు విద్యార్థులు కృషి చేయాలి

by Sridhar Babu |
లక్ష్యసాధనకు విద్యార్థులు కృషి చేయాలి
X

దిశ, ఎడ్యుకేషన్ ఖమ్మం : నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు విద్యార్థులు నిర్విరామంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం నయా బజార్ జూనియర్ కళాశాల కాంప్లెక్స్ లో రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో మున్నేరు వరద బాధితులకు అందించిన వరద సహాయక కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొని మాట్లాడారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మున్నేరు వరదల్లో సర్వస్వం కోల్పోయిన విద్యా సంస్థలకు 3 లక్షల 87 వేల 600 రూపాయలతో ప్రహరీ గోడల నిర్మాణం, మరుగుదొడ్ల మరమ్మతులు, ల్యాబ్ ఏర్పాటు, ఫర్నిచర్, వంట సామాన్లు, డ్యూయల్ డెస్క్ లను సమకూర్చుకున్నట్టు తెలిపారు. గతంలో 20 ఫీట్ల వరద వస్తే ఈ సంవత్సరం 40 ఫీట్ల వరద వచ్చిందని, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, స్వచ్ఛందంగా వచ్చి పని చేశారని అన్నారు.

ఖమ్మం జిల్లాలో పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న ఖమ్మంను విడతల వారీగా బాగు చేసుకుంటున్నామని తెలిపారు. నేడు పాఠశాలను తీర్చిదిద్దినందుకు రోటరీ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ కె. శరత్ చౌదరి మాట్లాడుతూ రోటరీ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాక్సిన్ కోసం 19 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టిందని అన్నారు. ప్రపంచంలో పోలియో లేకుండా చేసేందుకు రోటరీ పని చేస్తుందని తెలిపారు. రోటరీ నిమ్స్ సమన్వయంతో 900 మంది పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ చేశామని, మరో సంస్థతో సమన్వయం చేసుకుంటూ 1100 మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాది వాసుదేవ్, పి.సాంబ శివరావు, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ అధ్యక్షులు విసిరెడ్డి బాల కోటి రెడ్డి, డిప్యూటీ గవర్నర్ దొడ్డపనేని సాంబశివరావు, ప్రెసిడెంట్ రవీందర్ నాథ్, సెక్రటరీ హరి శ్రీనివాస్, ట్రెజరర్ సుధాకర్, రోటరీ క్లబ్ ప్రతినిధులు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్స్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed