- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యార్థులకు భోజనం అందించలేని శ్రీ చైతన్య యాజమాన్యం..అడవిలో ముగజీవాలు లాగా విద్యార్థులు
దిశ, ఎడ్యుకేషన్ ఖమ్మం : ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల ప్రాంతంలో గల శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. పై ప్రాంతంలో కురుస్తున్న వర్షం ప్రభావంగా వచ్చిన వరద నీటి వలన కళాశాలకు వెళ్లే మార్గం మొత్తం జలమయం కావడంతో విద్యార్థులకు కనీసం భోజనం కూడా పంపలేని స్థితి ఏర్పడిందని యాజమాన్యం ఆరోపిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ లక్షల రూపాయలు ఫీజులు తీసుకుని జిల్లా కేంద్రం అయినా ఖమ్మంలో ఇలా విద్యార్థులకు భోజనం కూడా అందించడం చేతకాపోవటం యాజమాన్య లోపమని విద్యార్థి సంఘాలు విచారణ వ్యక్తం చేస్తున్నాయి.
ఎక్కడో అడవులలో మారముల ప్రాంతాల్లో జీవుల్లాగా బిక్కు బిక్కు మంటూ రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా భోజన వసతులు పంపించగలుగుతున్న ఈ రోజుల్లో ఖమ్మం నడిబొడ్డున భోజనం అందక విద్యార్థులు ఇబ్బందులు గురి కావడం పట్ల శ్రీ చైతన్య యాజమాన్యానికి విద్యార్థుల పై ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. ఎక్కడ అడవుల్లో బిల్డింగులు కట్టి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు కనీస అవసరాలు తీర్చలేని యాజమాన్యాలు ఉంటే ఎంత లేకపోతే ఎంత అని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించి విద్యాశాఖ అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.