- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే ఎన్నికల్లో వైరాలో ఎవరు గెలుస్తారంటే...?
దిశ, వైరా: వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో వర్గ రాజకీయాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ రాజకీయాలతో బీఆర్ఎస్ పార్టీకి పెను ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం ఇవి రాజకీయాలు ఢీ అంటే ఢీ అనే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేతోపాటు, నియోజకవర్గంలోని ముఖ్య అధికారులపై వ్యక్తిగతంగా విమర్శలు చేసే స్థాయికి దిగజారాయి. అన్ని నియోజకవర్గాలకు భిన్నంగా వైరా నియోజకవర్గంలో మాత్రమే పార్టీలోని వర్గ విభేదాలు బీఆర్ఎస్‌కు ప్రతిబంధకంగా మారాయని అనడంలో సందేహం లేదు. ఈ విభేదాలతోనే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఆ పార్టీ గత అనుభవం నుంచైనా గుణపాఠం నేర్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లోనూ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీటిని కట్టడి చేయలేకపోతే గతంలో మాదిరిగానే వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు క్రాస్ ఓటింగ్ ద్వారా లాభం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గత అనుభవంతోనైనా బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం నేర్వని వైనం ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ మదన్ లాల్, బానోత్ చంద్రావతి వర్గాలుగా పార్టీ విడిపోయి ఉంది. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలను పోటా పోటీగా బీఆర్ఎస్ వర్గాలు వేరువేరుగా నిర్వహించారు. పోటాపోటీ ర్యాలీలతో వైరా వర్గ రాజకీయాలను మరింత వేడెక్కించారు. ఓ వర్గం వారు తమ అనుచరులతో అంతరంగిక సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యే రాముల నాయక్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేసే స్థాయికి వర్గ రాజకీయాలు వెళ్లాయి. అంతేకాకుండా నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులను బదనాం చేసే పరిస్థితికి ఈ రాజకీయాలు చేరుకున్నాయి. ఇంత జరుగుతున్నా తమకు ఏమీ తెలియనట్లు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం వ్యవహరించడం పార్టీకు నియోజకవర్గంలో ప్రతికూల అంశంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రతిపక్షాలకు లాభమే..?
బీఆర్ఎస్ లోని వర్గ విభేదాల వల్ల భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు లాభం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కూడా ఇదే వర్గ రాజకీయం కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా పొంగులేటి శిబిరానికి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయనటంలో సందేహం లేదు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తుందని ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. ఇక్కడి కమ్యూనిస్టులు బీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తారా...? అనే అనుమానాలు బలంగా ఉన్నాయి. ఈ వర్గాలను నియంత్రించకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కని వర్గం టిక్కెట్టు వచ్చిన వర్గంపై కత్తి కట్టి పరోక్షంగా బీఆర్ఎస్ కు పోటీగా ఉండే ప్రతిపక్షంకు ఓట్లను క్రాస్ చేసే పరిస్థితి కనిపిస్తున్నది. దీని వల్ల పొంగులేటి వర్గానికి కానీ, కాంగ్రెస్ కు కానీ వచ్చే ఎన్నికల్లో లబ్ధి చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించినప్పటికీ పార్టీలోని వర్గాలను ఒకే తాటిపైకి తీసుకువస్తే గానీ పార్టీ గెలుపు తీరాలకు చేరే అవకాశం లేదు.