- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరిగిపోతున్నా... అధికారులు పలకరేం..?
దిశ, ఖమ్మం బ్యూరో: మట్టి తోలకాలు యథేచ్ఛగా చేస్తూ అక్రమార్కులు చెలరేగుతున్నారు. లారీలు, ట్రాక్టర్లలో అక్రమంగా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఈ దందా జరుగుతున్నా.. మైనింగ్ అధికారులు పట్టించుకోక పోవడం అనేక అనుమానాలకు దారితీస్తున్నది. పెద్ద పెద్ద గుట్టలు కరిగిపోతున్నా.. అధికారుల కళ్ల ఎదుటే పదుల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు మట్టి తరలించుకుని పోతున్నా పట్టించుకునేవారు లేకపోవడం విస్మయం కలిగిస్తున్నది.
రఘునాథపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో ఈ దందా మూడు ట్రాక్టర్లు.. ఆరు లారీల వలే స్పీడు అందుకున్నది. గుట్టలు కరుగుతున్నా, ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తున్నది. తాజాగా ఓ ప్రజాప్రతినిధి దృష్టికి ఈ విషయం రావడంతో అధికారులపై సీరియస్ అయినట్లు తెలిసింది.