సమ్మక్క సారమ్మలను దర్శించుకున్న సినీనటుడు సుమన్..

by Sumithra |
సమ్మక్క సారమ్మలను దర్శించుకున్న సినీనటుడు సుమన్..
X

దిశ, అశ్వారావుపేట : అశ్వారావుపేట మండలంలో సోమవారం సినీనటుడు సుమన్ సందడి చేశారు. ఏపీలోని భీమవరం నుండి వస్తూ తిరుమలకుంట గ్రామం వద్ద ఆగిన సినీ నటుడు సుమన్ కల్లుగీత కార్మికులను కలసి ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక గౌడ సంఘం నాయకుడు బుర్ర వెంకటేశ్వరరావు నివాసంలో తేనేటి విందుకి సుమన్ హాజరయ్యారు.

అనంతరం రెడ్డిగూడెం గ్రామపంచాయతీ బండారుగుంపులో సమ్మక్క సారమ్మ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమన్ తో ఫోటోలు సెల్ఫీలు దిగినందుకు ఆసక్తి కనబరిచారు. అనంతరం ములకలపల్లిలో నూతనంగా నిర్మించిన శివాలయాన్ని దర్శించుకునేందుకు ఆయన పయనమయ్యారు. గౌడ సంఘం నాయకులు జూజ్జురి వెంకటనారాయణ, పల్లెల వెంకటేశ్వరరావు, గడ్డం పుల్లారావు, జుజ్జురి వెంకటనారాయణ, కోసూరి నాగు, కొప్పుల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story