- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం చరిత్ర తెలుసుకో : బీజేపీ నేతలు
దిశ ఖమ్మం టౌన్ : పూటకో పార్టీ మార్చుతూ ఊసరవెల్లిలా ఉండే నీకు అంత ఉంటే సిద్ధాంతం కోసం పనిచేసే మాకు ఎంత ఉండాలని, తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం చరిత్ర తెలుసుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ మంత్రి పువ్వాడకు సూచించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్రి పువ్వాడ బీజేపీపై అవాకులు చెవాకులు పేలుతున్నారని, తాటాకు చెప్పుళ్లకు బయపడమని హెచ్చరించారు. అక్రమంగా వసూలు చేసిన, సంపాదించిన డబ్బుతో ఫ్లెక్సీలు పెడుతున్నాడని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ లో ఎవరు చేరినా వారికి భవిష్యత్తు ఉండదు అని అంటున్నారని, నేడు హరీష్ రావు పక్కన కూర్చున్న వారు ఎవరు కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో లేరని గుర్తు చేశారు. వీరంతా కోట్లాది రూపాయలు బీఆర్ఎస్ కు చెల్లించి పదవులు కొనుక్కున్నారని విమర్శించారు. మంత్రి పువ్వాడ నేను పీకాల్సింది చాలా ఉంది... కూల్చాల్సింది చాలా ఉంది అని, అది చేశాకనే తాను కూకట్ పల్లి పోతానని మతి బ్రమించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఖమ్మం ని అభివృద్ధి చేస్తాడని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు తప్ప ఏదో పీకటానికో కూల్చడానికో కాదని హితవు పలికారు. ఖమ్మం జిల్లాలో రూ.8500 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో నేషనల్ హైవే అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. సెంట్రల్ లైటింగ్ కి 200 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో అభివృద్ధి జరిగిందని చెప్పారు. 18 వ తారీకున జరిగే మీటింగ్ కు అన్ని ప్రైవేట్ స్కూళ్ల మీద ఒత్తిడితో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని, ఆ బస్సులన్నీ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రధాని కావాలని కోరుకోవడం తప్పు కాదని, తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసిన విధంగానే దేశం మొత్తం కూడా దోచుకోవాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో బీజేపీ గెలుపు ఖాయమని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు నిద్రపట్టడం లేదన్నారు. 18 తరువాత బీజేపీ ఏంటో చూపిస్తుందని అన్నారు. ఈ సమావేశం లో జిల్లా ప్రధాన కార్యాదర్శి రుద్ర ప్రదీప్, నున్న రవి కుమార్, శ్యామ్ రాథోడ్, శ్రీనివాస్, విజయరెడ్డి, సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.