వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

by Sridhar Babu |
వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి
X

దిశ, కొత్తగూడెం : ఇటీవల కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నష్టం ఎక్కువగా ఉందని, కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడారు. వర్షాలు, వరదల కారణంగా ఎంతో ఇబ్బంది ఎదురైందని, ఈ ప్రకృతి విపత్తుకు గురైన ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం తక్షణమే రూ.10 వేల కోట్లను విడుదల చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన సహాయం చేస్తూనే ఉందని, నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసినప్పుడు రూ.5644 కోట్లుగా తేలిందని, ఆ తర్వాత క్షేత్రస్థాయి పర్యటన లెక్కల ప్రకారం నష్టం రూ.6 వేల కోట్లుగా తేలిందని చెప్పారు.

ఈ మొత్తాన్ని కేంద్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో మానేరు, మున్నేరు కారణంగా వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయని, ప్రజలు చాలా మంది కట్టుబట్టలతో మిగిలారని తెలిపారు. భద్రాద్రి జిల్లాలో కిన్నెరసాని ప్రభావంతో పాల్వంచ మండల పరిధిలోని పలు గ్రామాలు నీట మునిగాయని తెలిపారు. సీపీఐ ఆధ్వర్యంలో వారిని తక్షణమే ఆదుకునేందుకు నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరా పంట నష్టానికి రూ.10 వేలు, ఇళ్ల నష్టానికి రూ.16500 ఇస్తోందని, ప్రస్తుత ధరల ప్రకారం పరిహారం అందించాలని, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఎకరాకు రూ.30 వేలు, ఇళ్లకు రూ.50 వేలు ఇవ్వాలని, వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.10 లక్షల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని కోరారు. కేంద్ర మంత్రుల బృందం కంటితుడుపు చర్యగా పర్యటన చేశారన్నారు.

బారెడు మాటలు మాట్లాడే కిషన్ రెడ్డి బాధ్యతను విస్మరించారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వరరావు, సరెడ్డి పుల్లారెడ్డి, కె.సారయ్య, నరాటి ప్రసాద్, చంద్రగిరి శ్రీనివాస్, మున్నా లక్ష్మీ కుమారి, ఏసీడీ సలీం, రేసు ఎల్లయ్య, సలిగంటి శ్రీనివాస్, ఏపూరి బ్రహ్మం, దేవరకొండ శంకర్, మండలాల, పట్టణాల కార్యదర్శులు వాసిరెడ్డి మురళీ, వీశంశెట్టి పూర్ణచంద్రరావు, గుండెపిన్ని వెంకటేశ్వరరావు, భూక్యా ధస్రు, గుగులోత్ రామ్ చందర్, జి. రామకృష్ణ, ధర్మ, డి.సుధాకర్, వాగబోయిన రమేష్, బొర్రా కేశవులు, యూసఫ్, ప్రజా సంఘాల జిల్లా బాధ్యులు కంచర్ల జమలయ్య, రత్నకుమారి, చిరు మామిళ్ల వెంకటేశ్వరరావు, వట్టికొండ మల్లిఖార్జున రావు, ఉప్పుశెట్టి రాహుల్, బండి నాగేశ్వరరావు, నాగుల్ మీరా, భూక్యా శ్రీనివాస్, పేరాల శ్రీను, జక్కుల రాములు, కోమారి హనుమంతరావు, మాచర్ల శ్రీనివాస్, యూసుఫ్, ధర్మరాజు, యూసుఫ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story