- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డిజిటల్ మీడియాలో రాకెట్ వేగంతో ముందుకు దూసుకు వెళ్తున్న ‘దిశ’ : మధిర సీఐ
దిశ,మధిర : డిజిటల్ మీడియా రంగంలో తనదైన శైలిలో చెరగని ముద్ర వేసుకుని దిశ దినపత్రిక రాకెట్ వేగంతో ముందుకు దూసుకు వెళ్తుతున్నదని మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ డి మధు అన్నారు. మధిర సర్కిల్ కార్యాలయంలో మధిర సిఐ డి.మధు డిజిటల్ మీడియా దిశ దినపత్రిక 2025 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. డిజిటల్ మీడియా దిశ దినపత్రిక యాజమాన్యానికి , సంపాదకులకు , ఉద్యోగులకు , విలేకరులకు, పాఠకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ మీడియా రంగంలో దిశ దినపత్రిక అనతికాలంలోనే ప్రజల , పాఠకుల మన్నలను పొందింది అన్నారు .
ఎప్పటి వార్తలు అప్పుడే పాఠకులకు చేరే విధంగా చర వేగంతో ముందుకు దూసుకు పోతూ , నిజాన్ని నిర్భయంగా వార్త రూపంలో పాఠకులకు చేరవేసే సత్తా గల పత్రిక దిశ దినపత్రిక అని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను వివరాలను సంక్షిప్తంగా ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో ముందుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగిలిన రాష్ట్రాలతో పాటు ప్రపంచంలో నలుమూల ఎక్కడ ఏమి జరిగిన వెంటనే డైనమిక్ ఎడిషన్ ద్వారా పాఠకులకు వార్త చేరవేయటంలో డిజిటల్ దిశ దినపత్రిక ముందుంది కాబట్టే అందరి నుంచి ప్రశంసలు అందుకుంటుంది అన్నారు.
అంతేకాకుండా దిశ టీవీ ద్వారా సమాజంలో జరిగిన యదార్థ సంఘటనలను, కాలానికి అనుగుణంగా ప్రజలకు అవసరమైన వైద్య విద్య ఉపాధి , ఉద్యోగం తదితర అంశాలపై , మౌలిక వసతులపై ప్రత్యక్ష ప్రచారాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి ప్రజలకు అనుగుణంగా ప్రసరిస్తుంది. డిజిటల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టి నాలుగు సంవత్సరాల అయినప్పటికీ జరిగిన వెంటనే వార్తలను చేరవేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందు వరుసలో నిలిచిందని , కాబట్టే మిగతా పత్రికలకు , విలేకరులకు డిజిటల్ దిశ దినపత్రిక ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో దిశ మధిర నియోజకవర్గ రిపోర్టర్ చల్లా నర్సింహారెడ్డి బోనకల్ దిశ రిపోర్టర్ జక్కుల రామారావు పాల్గొన్నారు.