అదుపుతప్పి ఆటోను ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

by samatah |
అదుపుతప్పి ఆటోను ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి
X

దిశ-బూర్గంపాడు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని మర్రికుంట గ్రామం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దుర్మరణం చెందారు.సారపాకకు చెందిన కారు విజయవాడ నుంచి సారపాకకు వెళ్తున్న క్రమంలో మర్రికుంట గ్రామం వద్ద ఫ్రంట్ టైర్ పగిలి అదుపుతప్పి కూరగాయల లోడుతో ముందు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది.దీంతో ఆటోలో ఉన్న కూరగాయలు డ్రైవర్ హనుమంతుపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న బూర్గంపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు

Advertisement

Next Story