ట్రాక్టర్ ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి

by Shiva |   ( Updated:2023-02-12 16:34:21.0  )
ట్రాక్టర్ ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి
X

దిశ, అశ్వారావుపేట: పత్తిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం కొండపల్లి గ్రామం నుంచి అశ్వారావుపేటకు పత్తి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఉట్లపల్లి గ్రామ శివారులో గ్రానైట్ రాళ్ల లోడుతో వస్తున్న లారీ వెనక నుంచి ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న పీరాల ప్రసాద్ (30) అనే వ్యక్తి రోడ్డుపైకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ బాలకృష్ణ, ఎస్ఐ రాజేష్ కుమార్ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చరికి తరలించారు. మృతుడికి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed