కేంద్రంలో మరోసారి బీజేపీదే అధికారం: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

by Satheesh |
కేంద్రంలో మరోసారి బీజేపీదే అధికారం: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయిందని, పోలింగ్‌కు ముందు 14 సీట్లు గెలుస్తామని చెప్పిన వారే ఇప్పుడు 9 సీట్లు గెలుస్తామని అంటున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి మాటల్లో మార్పు కనిపించిందన్నారు. తెలంగాణలో బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తుందని అలాగే మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారం కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని ఆదరించి అక్కున చేర్చుకున్న రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. దేశం కోసం, ధర్మం కోసం, మరోసారి మోడీ ప్రధాని కావడం కోసం బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమించి పని చేశారని వారికి ఆయన కృతఙ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story