KCR: ప్రతిపక్ష హోదాలో మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్న కేసీఆర్

by Mahesh |
KCR: ప్రతిపక్ష హోదాలో మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్న కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడో శాసనసభ సమావేశాలు రెండు విడతలు నిర్వహించారు. ఈ రెండు విడతల సమావేశానికి మాజీ సీఎం, ఎమ్మెల్యే కేసీఆర్ హాజరు కాలేదు. కానీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారని పార్టీ నేతలు తెలుపుతున్నారు. ఈ నెల 25న తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జె్‌ట్‌ ప్రవేశ పెట్టనుంది. ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్‌ తొలిసారిగా పాల్గొంటున్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ప్రతిపక్షం ఏమిటో చూపుతామని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ అధినేత సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పార్టీ మారిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించేందుకు బీఆర్‌ఎస్‌ సన్నద్దమవుతోంది. ఇదిలా ఉంటే అధికారంలో ఉన్న సమయంలో సభలో కేసీఆర్ ప్రతిపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేశారు. మరి ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కొంటరోనన్న ఉత్కంఠ రాష్ట్ర ప్రజల్లో నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed