కేసీఆర్ వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపో.. : విజయశాంతి

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-26 14:01:42.0  )
కేసీఆర్ వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపో.. : విజయశాంతి
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ తొందరగా వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపో అంటూ బీజేపీ నేత విజయశాంతి అన్నారు. కూకట్ పల్లికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరగా వారిని బండిసంజయ్‌తో కలిసి విజయశాంతి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయ శాంతి మాట్లాడుతూ.. సొంత పార్టీలోని మహిళా నేతలను కూడా బీఆర్‌ఎస్ నాయకులు గౌరవించడం లేదన్నారు. రాష్ట్ర గవర్నర్‌కు కేసీఆర్ గౌరవం ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story