- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాసాని గెలుపు.. బీసీల అభివృద్ధికి మలుపు: మాజీ సీఎం కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లోని ఎంపీ అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఈ రోజు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా కేసీఆర్.. ప్రజా ఆశీర్వాద భారీ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేసీఆర్, కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. అలాగే నిన్న ఒక కాంగ్రెస్ పెద్దమనిషి మాట్లాడుతూ.. మీ బీసీలకు దమ్ముంటే, బీసీలకు పౌరుషం ఉంటే కాసాని జ్ఞానేశ్వర్‌ని గెలిపించి చూపియ్యండని చాలేంజ్ విసిరాడని గుర్తు చేశారు. ఇక్కడున్న బలహీనవర్గాల మేధావులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు మనవి చేస్తున్నా.. కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు, బీసీల అభివృద్ధికి మలుపు కాబట్టి కాసానిని గెలిపించండంటూ.. మాజీ సీఎం కేసీఆర్ చేవెళ్ల ఓటర్లను కోరారు.