యువ క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటా: మంత్రి కొప్పుల ఈశ్వర్

by Shiva |   ( Updated:2023-03-12 10:36:47.0  )
యువ క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటా: మంత్రి కొప్పుల ఈశ్వర్
X

దిశ, గొల్లపల్లి:నిరుపేద కుటుంబాలకు చెందిన యువ క్రీడాకారులకు తాను ఎల్లప్పడూ అండా ఉంటానని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామానికి చెందిన కండ్లే శ్రీకాంత్ ఇటీవల భూటాన్ లో జరగబోయే నేషనల్ సాఫ్ట్ బేస్ బాల్ కాంపిటీషన్ కు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కొంటున్నా యువ క్రీడాకారుడు శ్రీకాంత్ కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసి తన బాధల చెప్పుకున్నాడు.

దీంతో వెంటనే స్పందించిన మంత్రి ఆ యువ క్రీడాకారుడికి శుభాకాంక్షలు తెలిపి, శాలువతో సత్కరించి ఏ విధమైన సహకరానికైనా ఎల్లప్పుడూ అండగా అందుబాటులో ఉంటానని హామి ఇచ్చాడు. తెలంగాణ యువకులు క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించడం చాలా గర్వకారణమని పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ మండలాధ్యక్షుడు బొళ్లెం రమేష్, ఏఎంసీ చైర్మన్ కంపెళ్లి హనుమాండ్లు, చందోలి ప్యాక్స్ చైర్మన్ గండ్ర వెంకట మాధవ్ రావ్, బీఆర్ఎస్ యువ నాయకులు కిష్టంపేట రాంచందర్ రెడ్డి, కడబండ సుధాకర్, మాడేటి తిరుపతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story