- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
అభివృద్ధిని చూసి ఓర్వలేకే శిలాఫలకం ధ్వంసం.. మాజీ సర్పంచ్
దిశ, కోరుట్ల రూరల్ : మండలంలోని నాగులపేట గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే శిలాఫలకం ధ్వంసం చేసారని మాజీ సర్పంచ్ కేతిరెడ్డి భాస్కర్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొందరు అభివృద్ధి చేసే దమ్ములేక గతంలో మేము చేసినటువంటి అభివృద్ధి పనుల శిలా ఫలకాలను పగలగొట్టి, ప్రజల, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేస్తున్నారన్నారు.
దమ్ము ధైర్యం ఉంటే ఇలాంటి మేం చేసిన పనుల కంటే, ఎక్కువ పనులు చేసి దాని పక్కన వారి పేర్లు పెట్టుకొని గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలె కానీ ఇలాంటి పనులు చేతగాని దద్దమ్మలే చేస్తారని ఎద్దేవా చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని ఒదిలే ప్రసక్తే లేదన్నారు. మళ్ళీ ఇలాంటి పనులు పునరావృతం అయితే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.